భళా.. కుర్రాళ్లు

0
8

– ఆసియా పురుషుల హాకీ ఛాంపియన్‌గా భారత్‌
ఆసియా పురుషుల ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. మలేషియాతో శనివారం జరిగిన ఫైనల్‌లో 4-3 గోల్స్‌ తేడాతో గెలుపొందింది. మొదట్లో కాస్త తడబడి వెనుకంజ వేసినా అసాధారణరీతిలో పుంజుకొని వరుస గోల్స్‌ చేసి మలేషియాను చిత్తు చేసింది. 9వ నిమిషంలో తొలి గోల్‌ చేసిన భారత్‌, ఆ తర్వాత 14 నిమిషంలో, 45 నిమిషంలో, 56వ నిమిషంలో గోల్స్‌ చేసి తిరుగలేని విజయం సాధించి, ఛాంపియన్‌గా అవతరించింది. ఈ టోర్నీలో ఆరు మ్యాచ్‌లాడిన భారత్‌ ఐదింట్లో విజయం సాధించగా, ఒకదాంట్లో ఫలితం తేలలేదు. ఆసియా హాకీ ఛాంపియన్‌గా అవతరించిన భారత జట్టుకు ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here