ప్రజానావ/వేములవాడ రూరల్: 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం వేములవాడనంది కమాన్ వద్ద బీజేపీ వేములవాడ అర్బన్ మండల అధ్యక్షుడు చింతపల్లి వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బుర్ర శేఖర్ గౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతపల్లి మోహన్ రావు, యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింక అనిల్, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి గుండెకర్ల లక్ష్మణ్, మండల ప్రధాన కార్యదర్శి చంద్రగిరి ప్రశాంత్, మండల ఉపాధ్యక్షుడు సంతోష్ యాదవ్, రెడ్డవెని రాజు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు కొమిరె అంజన్న గౌడ్, నాగుల సురేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.