Deo: పాఠశాలల్లో యూనిఫాం, షూ, బుక్స్‌, స్టేషనరీ అమ్మొద్దు

0
215

ఇకనుంచి హైదరాబాద్‌ జిల్లాలో నడుస్తున్న పాఠశాలల్లో (సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ) యూనిఫాం, షూ, బుక్స్‌, స్టేషనరీ అమ్మకూడదని రాష్ట్రంలోని పాఠశాలలకు హైదరాబాద్‌ డీఈఓ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

పాఠశాలలో ఎలాంటి విక్రయాలైనా వాణిజ్యేతరంగా, లాభాపేక్ష లేకుండా ఉండాలని ఆదేశించారు. అలాగే పాఠశాలలను ఎప్పటికప్పడు పర్యవేక్షించేందుకు మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అన్ని డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ అధికారులు ఆదేశాలు వెళ్లాయి.

కోర్టు ఆదేశాల ప్రకారం అన్నీ పాఠశాలలు ఈ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇక జూన్‌ 3 నుంచి 19వరకు ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో బడిబాట కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు డీఈఓ విజయకుమారి వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here