lok sabha election 2024: మమ్మల్నే ఓటు వేయనియ్యరా?

0
82
  • ఓటెయ్యనియలేదని ఈవీఎంలను చెరువలో పడేసిన ప్రజలు
  • పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో ఘటన

ప్రజలు ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లను చెరువులో పడేసిన సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా జయనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం కుల్తాలి ప్రాంతంలోని మేరీగంజ్‌లో బూత్‌ నెంబర్‌ 40,41లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. శనివారం ఇక్కడ చివరిదశ ఎన్నికలు జరగడంతో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా ఉదయం ఓటింగ్‌ ప్రారంభమైన తర్వాత అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతుదారులు కొందరు స్థానికులను ఓటెయ్యనియకుండా అడ్డుకున్నారు.

దీంతో ఆగ్రహించిన వారు ఈవీఎంలు, వీవీప్యాట్‌ యంత్రాను చెరువులో పడేసి నిరసన తెలిపారు. అడ్డుకున్న పోలీసులను వారి వాహనాలపై చెట్ల కొమ్మలు విసిరారు.

మరోవైపు అధికార పార్టీ మాత్రం స్థానికుల ఆరోపణలను ఖండించింది. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయగా, ఎలక్షన్‌ కమిషన్‌ అధికారులు విచారణ ప్రారంభించారు. ఇదిలాఉంటే ప్రత్యామ్నాయ ఈవీఎంలతో తిరిగి ఓటింగ్‌ను ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here