వాహ్‌.. వాట్‌ ఏ గేమ్‌!

0
22

– నాలుగో వన్డేలో రాణించిన యశస్వీ, గిల్‌
– మరో 3 ఓవర్లు మిగిలి ఉండగానే టీమిండియా విక్టరీ
– 2-2 తేడాతో సిరీస్‌ సమం
ఫ్లోరిడా: వెస్టిండీస్‌తో ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరిస్‌ను 2-2 తేడాతో సమం చేసింది. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. హెట్‌మెయిర్‌ (61), షాయ్‌ హోప్‌ (45) రాణించారు. టీమిండియా బౌలర్లలో ఆర్ష్‌దీప్‌ సింగ్‌ 3 వికెట్లు తీయగా, కుల్దీప్‌ యాదవ్‌ 2, అక్షర్‌ పటేల్‌, చహల్‌, ముకేశ్‌ కుమార్‌ ఒక్కో వికెట్‌ తీశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు కేవలం 1 వికెట్‌ మాత్రమే కోల్పోయి మరో 3 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్‌ (84, నాటౌట్‌), శుభ్‌మన్‌ గిల్‌ (77) తొలి వికెట్‌కు 165 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. గిల్‌ పెవియన్‌ చేరిన తర్వాత తిలక్‌ వర్మ (7, నాటౌట్‌)తో కలిసి మిగతా లాంఛనాన్ని యశస్వీ పూర్తి చేశాడు. యశస్వీ జైస్వాల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య సిరీస్‌ విజేతను తేల్చే చివరి టీ20 ఆదివారం ట్రినిడాడ్‌ వేదికగా జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here