ఫైనల్‌లోకి భారత్‌

0
16

– ఆసియా ఛాంపియన్స్‌షిప్‌లో జపాన్‌పై ఘన విజయం
– నేడు మలేసియాతో ఫైనల్‌
ఆసియా ఛాంపియన్స్‌షిప్‌లో భారత్‌ హకీ జట్టు తన అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఇప్పటికే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 4-0 తేడాతో ఓడించిన భారత్‌ శుక్రవారం నాడు జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో జపాన్‌ను తుదముట్టించింది. ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 5-0 తేడాతో ఘన విజయం సాధించి సగర్వంగా ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. శనివారం భారత హకీ జట్టు మలేసియాతో తుదిపోరులో తలపడనుంది. ఇదిలాఉంటే శుక్రవారం చైన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ ద్వారా తొలి స్కోరింగ్‌ పాయింట్‌ సాధించిన భారత్‌ 19 నిమిషంలో ఆకాశ్‌దీప్‌, 23వ నిమిషంలో కెప్టెన్‌ హర్మన్‌ రెండో గోల్‌ చేసి ప్రత్యర్థి జట్టును వణికించారు. ఓ వైపు ప్రత్యర్థి జట్టు గోల్‌ చేసేందుకు ఎంత ప్రయత్నించినా భారత ఆటగాళ్లు వారి ప్రయత్నాలపై నీళ్లు చల్లారు. అప్పటికే సగం మ్యాచ్‌ పూర్తికాగా భారత్‌ 3-0తేడాతో ఆధిక్యం ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ పోటీలో ఐదు మ్యాచ్‌లాడిన భారత్‌ నాలుగింట్లో జయకేతనం ఎగురవేయగా, ఓ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఇక శనివారం మలేసియాతో జరిగే తుదిపోరులోనూ ఇదే జోరు కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here