శెభాష్‌ జైస్వాల్‌

0
42

సెంచరీతో ఆకట్టుకున్న టీమిండియా బ్యాటర్‌


రాజ్‌కోట్‌ వేదికగా మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్‌, యువ బ్యాట్స్‌మెన్‌ యశస్వీ జైస్వాల్‌ ధనధన్‌ బ్యాటింగ్‌తో కేవంల 122 బంతుల్లోనే మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టి సెంచరీ సాధించాడు.

అనంతరం కొద్దిసేపటికే జైస్వాల్‌ (104, రిటైర్డ్‌ హార్ట్‌) గా వెనుదిరిగాడు. ప్రస్తుతం శుభ్‌మన్‌ గిల్‌ (65), కుల్దీప్‌ యాదవ్‌ (3) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో ఆకట్టుకున్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కేవలం (19) పరుగులు మాత్రమే చేసి జో రూట్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన రజత్‌ పటిదార్‌ (0) హార్ట్లీ బౌలింగ్‌లో రెహాన్‌ అహ్మద్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్‌లో భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసి, 322 పరుగుల లీడ్‌ను సాధించింది.

ఆంతకుముందు ఇంగ్లాండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకే కుప్పకూలింది. డకెట్‌ (153), బెన్‌ స్టోక్స్‌ (41) పరుగులు చేయగా, మిగతా బ్యాట్స్‌మెన్లంతా తక్కువ స్కోరుకే పెవిలయన్‌కు చేరారు.

భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ నాలుగు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌లు రెండేసి వికెట్లు పడగొట్టగా, బూమ్రా, అశ్విన్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

సెహ్వాగ్‌, మంజ్రేకర్‌ సరసన జైస్వాల్‌..
టీమిండియా యువ బ్యాట్స్‌మెన్‌ యశస్వీ జైస్వాల్‌ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడంతో అరుదైన ఘనతను అందుకున్నాడు. కే

వలం 13 ఇన్నింగ్స్‌లోనే మూడు సెంచరీలు సాధించిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. జైస్వాల్‌ కంటే ముందు టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, సంజయ్‌ మంజ్రేకర్‌లు ఉన్నారు.

బెన్‌ స్టోక్స్‌ @ సెంచరీ
రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న ఈ టెస్టు ద్వారా ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ అరుదైన ఘనత సాధించాడు. 100 టెస్ట్‌ మ్యాచ్‌లాడిన 76వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇంగ్లాండ్‌ నుంచి వంద టెస్ట్‌ మ్యాచ్‌లాడిన 16వ ఆటగాడిగా నిలిచాడు.

ఏ దేశంలో ఎంతమంది 100 టెస్టు మ్యాచ్‌లాడిన ఆటగాళ్లు
ఇంగ్లాండ్‌ 16
ఆస్ట్రేలియా 15
భారత్‌ 13
వెస్టిండీస్‌ 9
దక్షిణాఫ్రికా 8
శ్రీలంక 6
పాకిస్తాన్‌ 5
న్యూజిలాండ్‌ 4

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here