Icc t20 world cup: అమెరికా ఫ్లైట్‌ ఎక్కిన టీమిండియా ఆటగాళ్లు

0
186

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు టీమిండియా తొలి బ్యాచ్‌ అమెరికా ఫ్లైట్‌ ఎక్కింది. ఇందులో కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు రవీంద్ర జడేజా, శివమ్‌ దూబే, సూర్యకుమార్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, రిషభ్‌ పంత్‌,

కుల్దీప్‌ యాదవ్‌తో పాటు ఆర్ష్‌దీప్‌ సింగ్‌, మహ్మద్‌ సిరాజ్‌, అక్షర్‌ పటేల్‌ ఉన్నారు. వీరి వెంట హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌, బౌలింగ్‌ కోచ్‌ మాంబ్రేతో కూడి సహాయ సిబ్బంది బయల్దేరి వెళ్లారు.

ఇదిలాఉంటే టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జూన్‌ 1న భారత్‌ బంగ్లాదేశ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. అలాగే జూన్‌ 5న టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ

అంతర్జాతీయ స్టేడియంలో తలపడనుంది. టీమిండియా ఉన్న గ్రూప్‌లో ఐర్లాండ్‌తో పాటు పాకిస్తాన్‌, యూఎస్‌ఏ, కెనడా జట్లు ఉన్నాయి. ఈసారి రోహిత్‌ శర్మ నేతృత్వంలో టీమిండియా టీ20 ప్రపంచకప్‌ను

గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ ఇదే జరిగితే 11ఏళ్ల తర్వాత మళ్లీ ఐసీసీ ట్రోఫీని గెలిచిన జట్టుగా భారత్‌ నిలవనుంది. 2013లో ఇంగ్లండ్‌లో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీని మహేంద్రసింగ్‌ ధోనీ నేతృత్వంలో గెలిచిన విషయం తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here