హరీశ్‌రావు రాజీనామా చేయాలి

0
58
file photo

మాటలతో ప్రజలను నమ్మించలేరు
మంత్రి జూపల్లి కృష్ణారావు

మాట‌ల‌తో ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌లేర‌ని, గ‌ట్టిగా మాట్లాడినంత మాత్రాన అబ‌ద్ధాలు నిజాలు అయిపోవని ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు.

శ‌నివారం అసెంబ్లీలో నీటి పారుద‌ల రంగం శ్వేత‌ప‌త్రంపై చ‌ర్చ సంద‌ర్భంగా ఎమ్యెల్యే హ‌రీశ్‌రావు తీరుపై మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజ‌మెత్తారు.

బీఆర్ఎస్ హ‌యంలో ఎక్క‌డ అవినీతి జ‌ర‌గ‌లేద‌ని చెప్పుతున్నార‌ని, అవినీతి జ‌రిగిందో లేదో హ‌రీశ్‌రావు చెప్పాల‌న్నారు. చిత్త‌శుద్ధి, ఆత్మ‌సాక్షి ఉంటే హ‌రీశ్‌ రావు రాజీనామా చేయాల‌ని మంత్రి జూప‌ల్లి డిమాండ్ చేశారు.

త‌క్కువ ధ‌ర‌కే టెండ‌ర్లు
సాగునీటి ప్రాజెక్ట్ టెండ‌ర్ల‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని, కొంతమంది కాంట్రాక్ట‌ర్ల‌కు ల‌బ్ధి చేకూర్చేందుకు త‌క్కువ ధ‌ర‌కే టెండ‌ర్లు ద‌క్కేలా చేశార‌ని విమర్శించారు.

నీటి పారుదల రంగంలో 1.80 కోట్లతో టెండర్లు చేపట్టారని, పిలిచిన‌ 300 టెండర్లలో కాంట్రాక్ట‌ర్లంతా 1శాతం లోపు కోట్ చేయ‌డం విచిత్రంగా ఉందన్నారు. ఇందులో లోగుట్టు పెరుమాళ్ల‌కెరుక అన్న‌ట్లు కేసీఆర్‌, హరీశ్‌రావుకు తెలియదా అని జూపల్లి ప్రశ్నించారు.

అవినీతి జరగలేదని రుజువు చేయాలని, వీటినుంచి ఎలా తప్పించుకుంటారని మండిపడ్డారు. రాజీనామా చేస్తానని గట్టిగా చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పు కాదు కదా అని మండిపడ్డారు. నిజాయతీపరులు మాటలతో నమ్మించలేరని, చేతల ద్వారా మెప్పించాలని జూపల్లి పేర్కొన్నారు.

కృష్ణా జ‌లాల విష‌యంలో అన్ని స‌క్ర‌మంగా జ‌రిగాయంటున్నారని, మ‌రి ఆపరేషన్ ప్రోటోకాల్ అంశంపై కార్య‌ద‌ర్శి స్మితా సబర్వాల్ కేంద్రానికి రాసిన లేఖ‌లో స‌గం మాత్ర‌మే హ‌రీశ్‌రావు ప్ర‌స్తావించార‌ని, మిగితా వాటి మాటేంట‌ని మంత్రి జూప‌ల్లి ఈ సందర్భంగా నిల‌దీశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here