– ఇంగ్లాండ్‌పై 89 పరుగుల విజయం
– 8 వికెట్లతో రాణించిన గార్డ్‌నర్
నాటింగ్‌హామ్: ఇంగ్లాండ్, ఆస్ర్టేలియా మహిళల జట్ల మధ్య జరిగిన యాషెస్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ మహిళా జట్టు 89 పరుగుల విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోర్ 116/5తో చివరి రోజైన సోమవారం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 178 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో వ్యాట్ (54) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. ఇక ఆసీస్ బౌలర్లలో అష్లే గార్డ్‌నర్ 8 వికెట్లు తీసి జట్టుకు చిరస్మరణీయ విజయన్ని అందించింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 473 పరుగులు చేసింది.
సూదర్‌ల్యాండ్ (137, నాటౌట్), ఎల్లీసే పెర్రీ (99), తహ్లియా మెక్‌గ్రాత్ (61) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 463 పరుగులు చేసి దీటుగా బదులిచ్చింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో బీమౌంట్ (208), బ్రంట్ (78), కెప్టెన్ నైట్ (57) పరుగులు చేశారు. 10 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్ 78.5 ఓవర్లలో 257 పరుగులకు ఆలౌటైంది. మూనీ (85), కెప్టెన్ హీలే (50) రాణించారు. 267 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 49 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటై 89 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఆష్లే గార్డ్‌నర్‌కు దక్కించుకుంది.