జెడ్పీహెచ్ఎస్ లో కంప్యూటర్ చాంప్స్, రీడ్ ప్రోగ్రాం

0
10
  • జెడ్పీహెచ్ ఎస్ లో కంప్యూటర్ చాంప్స్, రీడ్ ప్రోగ్రాంప్రజానావ, వేములవాడ

    విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో రీడ్ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నట్లు జిల్లా సెక్టోరియల్ అధికారి పద్మజ అన్నారు. వేములవాడ పట్టణంలోని జెడ్పీహెచ్ ఎస్ లో చాంప్స్, రీడ్ కార్యకమాలను ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పద్మజ మాట్లాడుతూ, పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టిన రీడ్ కార్యక్రమం జూలై 31 వరకు కొనసాగుతుందని విద్యార్థుల్లో చదివే అలవాటును ప్రోత్సహించడం, విద్యార్థులు తమకు తాము స్వతంత్రంగా చదివే విధంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందినట్లు చెప్పారు.

    రీడ్ కార్యక్రమంపై ఆసక్తి కనబర్చిన విద్యార్థులను అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 63 ఉన్నత పాఠశాలలో ప్రవేశపెట్టిన కంప్యూటర్ చాంప్స్ కార్యక్రమాన్ని పరిశీలించి పిల్లల్లో సృజనాత్మకత పెంపుకు కంప్యూటర్ విద్య ఆవశ్యకతపై వివరించారు. అనంతరం జిల్లా బిజెపి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ జన్మదిన సందర్భంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత బస్సు పాసులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సుహాసిని కృష్ణ, బాలరాజు యాదగిరి, హరికృష్ణ, శ్రీనివాస్, సీఆర్పీ ఆకుల శ్రీనివాస్ ,నగేష్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here