కరీముల్లా సేవలు అభినందనీయం

0
1

– మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ శంకర్ రావు
ప్రజానావ/ సికింద్రాబాద్ : సికింద్రాబాద్ డివిజన్ అసిస్టెంట్ డివిజనల్ సెక్రటరీ కరీముల్లా పదవి విరమణ వేడుకలు మజ్దూర్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మజ్దూర్ యూనియన్ జోనల్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ శంకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరీముల్లా మజ్దూర్ యూనియన్ లో క్రమశిక్షణ కల్గిన కార్యకర్తగా సమస్యలఫై పోరాటం చేశారన్నారు.

మృధుస్వభావిగా అందరితో మంచి పేరు ప్రఖ్యతలు సంపాదించారని, యూనియన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని గుర్తు చేయడంతో పాటు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాస్, కోశాధికారి సరోజినిరెడ్డి, ఉదయ భాస్కర్, మురళీధర్, వరప్రసాద్, సికింద్రాబాద్ డివిజన్ సెక్రెటరీ రవీందర్, ప్రెసిడెంట్ ఖాజాబా, కృష్ణ, నాయక్, సంజీవ, బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చిలుకు స్వామి, భారటే, యుగంధర్, సమ్మయ్య, సంపత్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here