తెలుగు సినిమా దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వీర శంకర్

0
30

– ఉత్కంఠ భరితంగా ఎన్నికలు

హైదరాబాద్ కేంద్రంలోని స్థానిక ఫిలింనగర్‌లో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఆదివారం తెలుగు సినిమా దర్శకుల సంఘం ఎన్నికలు ఉత్కంఠ భరితంగా జరిగాయి. తెలుగు సినిమా దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వీర శంకర్, ఉపాధ్యక్షుడిగా నీలం సాయి రాజేష్, ఎం వీఎన్ రెడ్డి (వశిష్ట), ప్రధాన కార్యదర్శిగా సుబ్బారెడ్డి, సంయుక్త కార్యదర్శిగా కస్తూరి శ్రీనివాస్, వడ్డానం రమేశ్‌, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ప్రియదర్శిని ,వంశీకృష్ణ, కోశాధికారిగా పీవీ రామారావు, కమిటీ మెంబర్లుగా కృష్ణమోహన్, ఆకాశ్‌, రాజా వన్నెం రెడ్డి, శైలేష్, కొలను, శ్రీరామ్ ఆదిత్య, కూరపాటి రామారావు, లక్ష్మణరావు, ప్రవీణ, రమణ, కొండా విజయ్ కుమార్ లు ఎన్నికల్లో గెలుపొందారు. అనంతరం వారు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here