Tamannah: ఏంటీ తమన్నా అలా అనేసింది

0
242

మిల్కీ బ్యూటీ తమన్నా అన్ని జోనర్ల సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల తను నటించిన లస్ట్‌ స్టోరీస్‌ 2లో బోల్డ్‌ సన్నివేశాల గురించి ఈ భామ ఎలాంటి బిడియం లేకుండానే నోరు విప్పింది.

ఈ సినిమాలో తను చేసిన క్యారెక్టర్‌ గురించి మాట్లాడుతూ బోల్డ్‌ సీన్‌లో తను ఏమాత్రం భయంగా ఫీల్‌ కాలేదని, అస్సలు టెన్షన్‌ పడకుండా నటించానని చెప్పింది. ఈ సినిమాలో తమన్నా ముద్దుసీన్లలో రెచ్చిపోయి నటించింది.

పైగా తన ప్రియుడు విజయ్‌వర్మ వద్ద తనకు అంతటి చనువు ఉందని.. అతనితో రోమాన్స్‌ చేయడాన్ని ఎంజాయ్‌ చేస్తానంటూ ఈ మిల్కీ బ్యూటీ బోల్డ్‌గానే చెప్పేసింది.

బోల్డ్‌ సీన్లలో నటిస్తే తప్పేంటి అని కామెంట్స్‌ చేసి యూత్‌ను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. విజయ్‌వర్మ, తమన్నా ఇద్దరు గత కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నారు.

వీరిద్దరూ త్వరలో పెళ్లిపీటలు కూడా ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ కారణంగానే ఇటీవల పలు ప్రాజెక్టుల్లో ఇద్దరు కలిసి నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here