దైవ దర్శనానికి వస్తే నిలువు దోపిడీ

0
21

– వేములవాడలో వృద్ధురాలిని నమ్మించి 3 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన కేటుగాడు

దైవ దర్శనానికి వచ్చిన ఓ వృద్ధురాలు నిలువు దోపిడీకి గురైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లాకు చెందిన వృద్దురాలిని ఓ వ్యక్తి రూమ్‌ దగ్గర దింపుతానని నమ్మించి బైక్‌పై తీసుకెళ్లాడు. రూమ్‌ దగ్గరకు కాకుండా ఓపెన్‌ ఏరియాకు తీసుకెళ్లి వృద్ధురాలిని బెదిరించి, తన మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడును తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు.

అయితే ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. మెరూన్ కలర్ డబ్బాల షర్ట్‌, నలుపు రంగు ప్యాంటు ధరించిన ఓ వ్యక్తి హీరో గ్లామర్‌ బైక్‌పై వృద్ధురాలిని తీసుకెళ్తున్నవీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే నెంబర్‌ ప్లేట్‌ ఫై3 అని రాసి ఉంది. సంబంధిత వ్యక్తి గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాలని వేములవాడ పట్టణ సీఐ కరుణాకర్‌ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here