ఆదుకున్న కెఎల్ రాహుల్, జడేజా
తొలి వన్డేలో ఆసేరలియా ఓటమి
ముంబై: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ శుభారంభం చేసింది. లక్ష్య ఛేదనలో మెుదట తడబడిన భారత్.. కెఎల్ రాహుల్ పోరాటంతో విజయాన్ని అందుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే లక్ష ఛేదనలో భారత్ కొంత తడబడింది. వరుస వికెట్లు కోల్పోయిన భారత్.. ఓ దశలో ఓడిపోతుందని అందరు భావించారు. కానీ చివరలో రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్ జట్టుతు మరపురాని విజయాన్ని అందించారు.
దీంతో ఐదు వికెట్ల తేడాతో.. విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 35.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా ఆరంభంలో తడబాటుకు గురైనప్పటికీ.. కేఎల్ రాహుల్ అర్దశతకం సాధించి భారత్‌ను గెలిపించాడు. రాహుల్‌కు తోడుగా రవీంద్ర జడేజా కీలక పరుగులు సాధించాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే మ్యాచ్ వైజాగ్ వేదికగా మార్చి 19వ తేదీ జరగనుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.