విచారణకు హాజరు కాలేను

0
4

– ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ
అనారోగ్య కారణాలతో ఈరోజు జరిగే విచారణకు హాజరు కాలేనంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. మీరు అడిగిన ప్రశ్నలకు నా సమాధానం ఇదే అంటూ తన ప్రతినిధితో అధికారులకు లేఖ పంపారు. అలాగే సుప్రీంకోర్టులో పిటీషన్ పెండింగ్ లో ఉందని, కోర్టు నిర్ణయం తర్వాత హాజరవుతానని కవిత లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. చివరి నిమిషంలో ఎమ్మెల్సీ విచారణకు హాజరు కాలేనంటూ షాక్‌ ఇవ్వడంతో ఇటు అధికారులు, అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. షెడ్యూల్ ప్రకారం అయితే ఉదయం 11 గంటలకే ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే తన న్యాయవాదులతో సుదీర్ఘంగా ఇంట్లోనే చర్చించారు కవిత. కాగా.. ఈడీ ప్రశ్నలకు సమాధానాలను లేఖ ద్వారా పంపించటం ద్వారా విచారణకు హాజరుకాకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా ఢిల్లీలో ఐదుగురు బీఆర్ఎస్ పార్టీ మంత్రులతో పాటు లాయర్లతో చర్చలు జరుపుతున్నారు. కవిత పంపిన లేఖపై ఈడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here