మెల్‌బోర్న్: ఆసీస్ మాజీ కెప్టెన్ టిమ్ పైన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కొలు పలికాడు. స్టీవ్ స్మిత్ తర్వాత ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు 46వ కెప్టెన్‌గా వ్యవహరించిన 38ఏళ్ల టిమ్ పైన్ ఎంపికయ్యాడు. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా స్మిత్‌ను కెప్టెన్సీ నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా తప్పించింది.
మూడేళ్లు కెప్టెన్‌గా కొనసాగాడు. ఆస్ట్రేలియా తరఫున 23 టెస్టులకు ఆసీస్ సారథిగా వ్యవహరించాడు. కెరీర్‌లో 35 టెస్టులు ఆడాడు. టాస్మానియా మాజీ క్రికెట్ ఉద్యోగికి అసభ్యకరమైన సందేశాలు పంపాడనే ఆరోపణలతో 2021నుంచి కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. 2010లోఅంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన టిమ్ పైన్.. వికెట్ కీపర్‌గా 157మంది బ్యాటర్లను ఔట్ చేశాడు.