– కావ్య పాపను అలా చూడలేకపోయా : రజనీకాంత్
వచ్చే సీజన్ వరకైనా హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టును విజయవంతం చేయండని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సన్‌రైజర్స్ జట్టు యజమాని కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్‌కు సూచించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శనపై తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పందించారు. పేలవ ప్రదర్శన నేపథ్యంలో టీమ్ ఓనర్ కావ్య మారన్ పడే బాధను తాను చూడలేకపోతున్నానని తెలిపారు. రజనీకాంత్ కొత్త సినీమా జైలర్‌ను కళానిధి మారన్ నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ఆడియో లాంచ్‌లో భాగంగా రజనీ ఇలా స్పందించారు. ‘సన్‌రైజర్స్ జట్టు మ్యచ్ ఓడిన ప్రతిసారి స్టేడియంలో కావ్య మారన్ నిరాశగా ఉండడం చూడలేకపోయా. కొన్నిసార్లు టీవీ ఛానెళ్లు మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. జట్టులోకి అనుభవజ్ఞులైన ఆటగాళ్లను తీసుకొని బలోపేతం చేయండి. వచ్చే సీజన్‌లో కావ్య ఎగిరి గంతేయడం మేం చూడాలి’ అని రజనీ కళానిధిని కోరారు. ఇక రజనీ మాటలు నెట్టింట వైరల్ కావడంతో పలువురు రజనీ చేసిన వ్యాఖ్యలు సరైనవేనంటూ ఆయనకు మద్దుతు పలికారు. ఇప్పటికైనా సన్‌రైజర్స్ జట్టు ఆటగాళ్ల విషయంలో దృష్టి సారించాలని సూచిస్తున్నారు.