Burnt washing michine: ఎండదెబ్బకు వాషింగ్‌ మిషినే పేలింది

0
272

బాల్కనీలో ఉంచిన వాషింగ్‌ మిషన్‌ ఎండదెబ్బకు పేలింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ సిటీ 2 సొసైటీకి చెందిన ఓ ఫ్లాట్‌ బాల్కనీలో వాషింగ్‌ మిషన్‌ ఉంచారు.

విపరీతమైన వేడకి వాషింగ్‌ మిషన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ రావడంతో ఏం జరిగిందో తెలియన ప్రజలు భయంతో పరుగులు తీశారు.

చుట్టు పక్క ఫ్లాట్ల వారి సాయంతో మంటలను అదుపులోకి తేగా, అప్పటికే వాషింగ్‌ మిషన్‌ పూర్తిగా కాలిబూడిదైంది. మంట్లలో కాలిపోతున్న వాషింగ్‌ మిషన్‌ వీడియో కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది.

దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతుండడంతో ప్రజలు భయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇప్పటికే చాలాచోట్ల ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here