– తార్నాకలో బీఆర్‌ఎస్ వార్డు కార్యాలయం ప్రారంభం
ప్రజా నావ/తార్నాక: తార్నాక డివిజన్ వార్డు కార్యాలయాన్ని సోమవారం గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత బీ ఆర్ ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగర ప్రజల సమస్యల తక్షణ పరిష్కారం కోసం నగరంలో 150 డివిజన్లలో వార్డు కార్యాలయలు ఏర్పాటు చేశారన్నారు.
వీటి ద్వారా ప్రజలకు పాలన మరింత చేరువ అవుతుందన్నారు. ఈ వార్డు కార్యాలయాల్లో ప్రజలు సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందన్నారు. ఇతర వార్డు ఫిర్యాదులను కూడా అన్నిచోట్ల స్వీకరిస్తారని, ప్రజలు వార్డ్ కార్యాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఎంసి హేమలత, ఏసీబీ ముంతాజ్ బేగం, జల మండలి డీజీఎం సరిత, శానిటేషన్ సూపర్‌వైజర్ ధనా గౌడ్, ఎంటమాలజీ సూపర్‌వైజర్ రాజశేఖర్, జీహెచ్ఎంసీ ఇతర అధికారులతో పాటు బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.