వార్డు కార్యాలయాలతో సమస్యలకు తక్షణ పరిష్కారం

0
15

– తార్నాకలో బీఆర్‌ఎస్‌ వార్డు కార్యాలయం ప్రారంభం
ప్రజా నావ/తార్నాక: తార్నాక డివిజన్ వార్డు కార్యాలయాన్ని సోమవారం గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత బీ ఆర్ ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగర ప్రజల సమస్యల తక్షణ పరిష్కారం కోసం నగరంలో 150 డివిజన్లలో వార్డు కార్యాలయలు ఏర్పాటు చేశారన్నారు.

వీటి ద్వారా ప్రజలకు పాలన మరింత చేరువ అవుతుందన్నారు. ఈ వార్డు కార్యాలయాల్లో ప్రజలు సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందన్నారు. ఇతర వార్డు ఫిర్యాదులను కూడా అన్నిచోట్ల స్వీకరిస్తారని, ప్రజలు వార్డ్ కార్యాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఎంసి హేమలత, ఏసీబీ ముంతాజ్ బేగం, జల మండలి డీజీఎం సరిత, శానిటేషన్ సూపర్‌వైజర్ ధనా గౌడ్, ఎంటమాలజీ సూపర్‌వైజర్ రాజశేఖర్, జీహెచ్ఎంసీ ఇతర అధికారులతో పాటు బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here