టమాటాల ట్రక్కు హైజాక్‌!

0
23

– నకిలీ ప్రమాదం సృష్టించి టమాటాల ట్రక్కు హైజాక్‌
– తమిళనాడులో ఘటన, పోలీసుల అదుపులో నిందితులు
దేశంలో ఎగబాకుతున్న టమాటా ధరలు కొంతమందిని ఎంతటి నేరానికైనా పురిగొల్పుతున్నాయి. దేనికైనా వెనకాడకుండా చేస్తుంది. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ జంట నకిలీ ప్రమాదాన్ని సృష్టించి 2.5 టన్నుల లోడుతో వెళుతున్న టమాటాల ట్రక్కును హైజాక్ చేశారు.

ఆ జంటను వెల్లూరు వాసులుగా పోలీసులు గుర్తించారు. రహదారి దొంగల ముఠాలో పనిచేస్తున్న ఈ జంట కర్నాటకలోని చిత్రదుర్గ నుంచి మల్లేశ్‌ అనే రైతు ట్రక్కుతో బయల్దేరారు. హరియూర్ దగ్గరకు రాగానే ట్రక్కు తమ కారును ఢీకొట్టిందని ఆరోపిస్తూ రోడ్డుపై నిలిపివేశారు. కొంత మొత్తం డిమాండ్ చేశారు. దానికి రైతు తిరస్కరించడంతో దాడి చేసి లారీ నుంచి అతన్ని దింపేసి ట్రక్కును డ్రైవ్ చేసుకుని వెళ్లిపోయారు. జులై 8న ఈ ఘటన జరిగంది. ట్రక్కులో రూ.2.5లక్షల విలువైన టమాటాలున్నాయి. పోలీసులకు రైతు ఫిర్యాదు చేయడంతో ముఠా గుట్టును రట్టు చేశారు. దంపతులు భాస్కర్(28), సింధూజ(26)ను అదుపులోకి తీసుకున్నారు. టమాటా లారీని కోలార్ తరలిస్తుండగా అడ్డుకుని తిరిగి రైతుకు అప్పగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here