భారత్‌-బంగ్లా మహిళల మూడే వన్డే డ్రా

0
11

– 1-1తో సిరీస్‌ సమం
– అర్ధ సెంచరీలతో రాణించిన స్మృతీ, హర్లీన్‌
ఢాకా: భారత్‌-బంగ్లా మహిళా జట్ల మధ్య శనివారం జరిగిన మూడో వన్డే డ్రాగా ముగిసింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇరుజట్లు 1-1 తేడాతో సమంగా నిలిచాయి. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్లు ఫర్గానా హక్‌ (107), షమీమా సుల్తానా (52) రాణించడంతో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది.

భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా 2 వికెట్లు తీయగా, దేవిక వైద్య ఒక వికెట్‌ తీసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళలు 225 పరుగులకు ఆలౌట్‌ కావడంతో మ్యాచ్‌ టై గా ముగిసింది. మరో మూడు బంతులు మిగిలి ఉన్నా వికెట్లు లేకపోవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్‌ స్మృతీ మంధన (59), హర్లీన్‌ డియోల్‌ (77) మాత్రమే రాణించారు. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇరుజట్టు 1-1 తేడాతో సమంగా నిలిచాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ హర్లీన్‌ దక్కించుకోగా, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ను ఫర్గానా హక్‌ గెలుచుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here