కరోనా కొత్త వేరియంట్ భారత్‌నూ వణికిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండడం కలకలం సృష్టిస్తోంది. తాజాగా భారత ఆరోగ్య మంత్రిత్వ దీనిపై బులిటెన్‌ను విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా కేపీ-1 వేరియంట్ కేసులు 34, కేపీ-2 వేరియంట్ కేసులు 290 వరకు నమోదైనట్లు వెల్లడించింది. అయితే ఈ వేరియంట్లతో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇదేం ప్రాణాంతకం కాదని స్పష్టం చేసింది.
ఇటీవలే సింగపూర్‌లో కొత్త వేరియంట్‌తో వేలాది మంది ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు. దాదాపు 26వేలకు పైగా ఈ వైరస్ భారిన పడినట్లు అక్కడి వైద్యారోగ్య శాఖ గుర్తించింది. భారత్ సహా ప్రపంచ దేశాలు సింగపూర్ నుంచి వస్తున్న వారిపై అప్రమత్తంగా ఉండాలంటూ డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది.