Vemulawada rural: ఈదురు గాలులకు విరిగిపడిన కరెంటు స్తంభం

0
221

తప్పిన పెను ప్రమాదం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌ మండలం కొండన్నపేట (ఎదురుగట్ల) గ్రామంలో బుధవారం అర్ధరాత్రి వీచిన ఈదురుగాలులకు కరెంట్‌ స్తంభం నివాసాల మధ్యే విరిగిపడింది.

అర్ధరాత్రి కావడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. విషయం తెలుకున్న లైన్‌మన్‌ గురువారం ఉదయం వచ్చి కరెంటు తొలగించారు. అర్ధరాత్రి స్తంభం విరిగిపడితే లైన్‌మన్‌ ఆలస్యంగా ఉదయం రావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒకవేళ ఏదైనా అనుకొని ప్రమాదం సంభవిస్తే ఏంటని నిలదీశారు. బుధవారం సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో వర్షం కురవడంతో పలు గ్రామాల్లో చెట్లు, స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here