Janhvi kapoor : దేవరలో నా పాత్ర ఇదే

0
175

బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌ తెలుగులో నటిస్తున్న మొట్టమొదటి సినిమా దేవర. జూ.ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదలకు ముందే ప్రపంచ చిత్ర పరిశ్రమను షేక్‌ చేస్తోంది.

శ్రీదేవి కూతురుగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న జాన్వీకపూర్‌కు ఇదే తొలి సినిమా అయిన ఎన్టీఆర్‌ పక్కన నటించడంతో ఇటు టాలీవుడ్‌, అటు బాలీవుడ్‌ అభిమానులు విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలాఉంటే తన తాజా చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీకపూర్‌ దేవర సినిమాలో తన పాత్రను రివీల్‌ చేశారు.

ఈ సినిమాలో తను తంగం పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొంది. షూటింగ్‌ అంతా సరదాగా సాగిందని, ప్రతి ఒక్కరూ తనను బాగా చూసుకున్నారు చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

చిత్ర యూనిట్‌ పనితీరు, అంకితభావానికి తను ఫిదా అయినట్లు చెప్పింది. మరోవైపు ఈ సినిమాలో అవకాశం రావడం, తన అభిమాన నటుడు ఎన్టీఆర్‌ సరసన నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు వివరించింది.

ఈ సందర్భంగా చిత్రయూనిట్‌కు కృతజ్ఞతలు చెప్పింది. టాలీవుడ్‌ సెన్సేషన్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది తొలి భాగం ‘దేవర’ పేరుతో అక్టోబర్‌ 10న థియేటర్లలోకి రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here