– టీటీడీ ఈఓ ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు
ప్రజానావ/తిరుమల: తిరుమల కాలిబాట మూసివేసే ఆలోచన చేస్తున్నట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సాయంత్రం 6గంటల తర్వాతి నుంచే కాలిబాటను మూసివేసేలా అధికారులతో చర్చలు జరుపుతామన్నారు. ఇటీవల కాలినడకన వస్తున్న భక్తులపై వరుసగా చిరుతలు దాడులు చేయడం ఆందోళన కలిగించే అంశమేనని, అయితే భక్తుల భద్రతే తమకు ముఖ్యమన్నారు. శనివారం తిరుమల జేఈఓ కార్యాలయంలో అటవీశాఖ, పోలీసులతో ఆయన ప్రత్యేక సమావేశమై భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. చిరుతను బంధించేందుకు ఇప్పటికే రెండు బోన్లు ఏర్పాటు చేశామని, కాలిబాటలో మరిన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. భక్తులు సైతం తమ పిల్లల పట్ట జాగ్రత్తగా ఉండాలని సూచించారు.