janasena: అసలు ఎవరు వీరంతా..!

0
239
  • రాజకీయాలకు వీరికేం సంబంధం?
  • ఇది అభిమానామేనా.. ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ఆరాటమా?
  • ‘జబర్దస్త్‌’ ఆర్టిస్ట్‌ల తీరుపై ప్రజల తీరొక్క మాట

వారంతా మొన్నటివరకు ఓ టీవీలో వచ్చే షో ఆర్టిస్టులే. ఇందులో ఒకరిద్దరూ వారికి ఉన్న ఫేమ్‌తో ఇటీవల కొన్ని సినిమాల్లోనూ నటించారు.

ఇక్కడివరకు బాగానే ఉంది. ఏపీ ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ వచ్చిన అనంతరం ఒక్కొక్కరుగా రాజకీయం వైపు మళ్లారు. అనుకున్నట్టుగానే అక్కడ పోటీ చేస్తున్న జనసేన పార్టీ కోసం పనిచేసేందుకు కలిసికట్టుగా ప్రచారాలూ చేశారు.

సాధారణంగా టీవీ షోలో మాదిరిగా పలు వేదికల్లో జనసేన (janasena) చీఫ్‌ పవన్‌కల్యాణ్‌ (pawan kalyan) కు అనుకూలంగా, వైసీపీతో పాటు మరీ ముఖ్యంగా మంత్రి రోజాపై విమర్శలు కురిపించారు.

సహజంగానే రోజా (roja) దీనిపై స్పందించి ఇలాంటి పిల్ల పిత్రేలు ఎంతమంది వచ్చినా వైసీపీకి ఒరిగేదేమీలేదంటూ ఘాటుగానే స్పందించారు.

ఇక ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. దీనిపై ఒక్కొరొక్కరుగా స్పందించిన జబర్దస్త్‌ ఆర్టిస్టులు రోజాను ఓ ఆట ఆడుకున్నారు. ఇందులో కిరాక్‌ ఆర్పీ, గెటప్‌ శ్రీను, రైజింగ్‌ రాజు, జానీ మాస్టర్‌ వంటి వారున్నారు.

ఇక తనను కొడుకులా భావించిన సుడిగాలి సుధీర్‌ కూడా రోజాను విమర్శించడంతో ప్రజలు కూడా వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అభిమానానికి హద్దే లేదా?
ఇక జనసేన తరఫున ప్రచారం చేసిన జబర్దస్త్‌ (jabardast) ఆర్టిస్టుల అభిమానం ప్రజలకు కొంత వినోదం పంచగా, వారి భారీ భారీ డైలాగులు మాత్రం ఆఫ్‌ స్క్రీన్‌పై పేలకపోగా.. ప్రజల్లో మాత్రం నిజమైన జబర్దస్త్‌ కమెడీయన్లుగా మిగిలిపోయారంటూ వైసీపీలోని కొంతమంది నాయకులు ఎద్దేవా చేశారు.

ఒకప్పుడు జబర్దస్త్‌కి వచ్చేందుకు పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబును పొగిడిన వీరంతా పలు సందర్భాల్లో చిరంజీవి అభిమానులుగానే చెప్పుకున్నారు. ఒక్క సుడిగాలి సుధీర్ మాత్రమే పవన్‌ కల్యాణ్‌ అభిమానిగా ప్రేక్షకులకు సుపరిచితమే.

అయితే కేవలం నాగబాబు కోసమే కాకుండా పలు చిత్రాల్లో అవకాశాల కోసం కూడా మెగా ఫ్యామిలీని వాడుతున్నారని జనాల్లో చులకనయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ప్రజల్లో జబర్దత్‌ (jabardast) ఆర్టిస్టులకు ఉన్న క్రేజ్‌ను చూసి నాగబాబే వారిని ఓ ప్యాకేజీ ప్రకారం మాట్లాడారని వైసీపీ ఆరోపిస్తుండగా, తాము జనసేన కోసం.. పవన్‌ కల్యాన్‌ కోసం స్వచ్ఛందంగా అన్నీ షూటింగ్‌లు మానుకొని వచ్చి ప్రచారం చేస్తున్నట్లు వారు చెబుతున్నారు.

ఏదేమైనా ఎన్నికలకు ముందు మంత్రి రోజాను ఆకాశానికెత్తిన వీరు ఎన్నికల ముందు పవన్‌ పక్కన చేరి విమర్శిస్తున్నారని సోషల్‌ మీడియా (social media) లో వస్తున్న వార్తలు వైరల్‌గా మారుతున్నాయి.

ఇదిలాఉంటే ఈ నెల 13న ఏపీలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో వీరు మద్దతిచ్చిన కూటమి విజయం సాధిస్తుందా.. లేదా చూడాలంటే జూన్‌ 4వరకు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here