30 శాతం వాటాల ప్రభుత్వం మళ్లీ వస్తే..

0
12

– కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి
ప్రజానావ/హైదరాబాద్‌: రాష్ట్రంలో 30 శాతం వాటాల ప్రభుత్వం మళ్లీ వస్తే ఆరాచకం రాజ్యమేలుతోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. భూములమ్మి ఉద్యోగులకు జీతాలిస్తున్నారని, అమ్మకాలపైనే కేసీఆర్‌ ప్రభుత్వం ఆధారపడిందని విమర్శించారు. కేవలం ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు దళితబంధు పథకం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఆ తర్వాత ఆ ఊసే ఎత్తడంలేదన్నారు. ఇటీవల జరిగిన ఓ మీటింగ్‌లో స్వయంగా సీఎం నోటివెంట తన ఎమ్మెల్యేలు దళితబంధులో వాటాలు తీసుకుంటున్నారని, ఆ విషయం తనకు తెలుసునని చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రజల నుంచి వసూలు చేస్తున్న ఎమ్మెల్యేలను పార్టీ నుంచి తొలగించాల్సిందిపోయి వారిని వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వస్తేనే పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు వస్తాయన్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై ట్యాక్స్‌ తగ్గించని ఏకైక ప్రభుత్వం ఒక్క తెలంగాణనే అని మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here