– వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
ప్రజానావ/సంగారెడ్డి: కాంగ్రెస్ ఏనాడూ కరెంటు ఇచ్చిన పాపాన పోలేదని, ఇప్పడుమో 3 గంటల కరెంటు అంటూ బయల్దేరిందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సంగారెడ్డిలో బీసీ బంధు చెక్కులను పంపిణీ చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలోనే రైతులకు ఉచిత విద్యుత్, ప్రజలకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తుందని, దేశంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని అన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇస్తానంటున్న మూడు గంటల కరెంట్‌తో మూడెకరాలు కూడా పారదని ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసి తీరుతామని, సోమవారం నుంచి రూ.99వేల వరకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. కులవృత్తులకు రూ.లక్ష సాయం అందించడం సంతోషంగా ఉందన్నారు.