- ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో దారుణం
- రూ.60వేలు ఇస్తేనే మృతదేహం ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యం డిమాండ్
- బంధువుల ఆందోళన
తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. అందుకే వైద్యో నారాయణ హరి అని వైద్యులను దేవుళ్లతో సమానంగా చూస్తాం.
అలాంటిది కొన్నిచోట్ల వైద్యులు.. ఆస్పత్రి యాజమాన్యాలు వైద్య వృత్తికే కలంకం తెస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ కామినేని ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది.
సాంబయ్య అనే వ్యక్తికి గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు, బంధువులు కామినేని ఆస్పత్రిలో చేర్పించారు.
అయితే సాంబయ్య మృతి చెందినా వైద్యులు మాత్రం వైద్యం చేసినట్లు నటించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బంధువులు ఆరోపించారు.
అంతేకాకుండా రూ.60వేలు కడితేనే మృతదేహాన్ని ఇస్తామని తేల్చిచెప్పడంతో ఆస్పత్రి యాజమాన్యంపై కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.
ఆస్పత్రి యాజమాన్యం డబ్బుల కోసమే శవాలకు కూడా వైద్యం చేస్తోందని మండిపడ్డారు. ఇదిలాఉంటే కామినేని ఆస్పత్రి ఠాగూర్ సినిమా చూపించిందని పలువురు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.