Hanuman Temple: అగ్రహారం హనుమాన్ ఆలయంలో నిర్లక్ష్యం

0
434
  • అధ్వానంగా మారిన నవగ్రహ విగ్రహాల దుస్థితి
  • పూజలు నిర్వహించుకునే భక్తులకు ఇబ్బందులు
  • అధికారుల పట్టింపు కరువు
  • మరమ్మతులు చేపట్టాలని కోరుతున్న భక్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయం అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నవగ్రహాల దుస్థితి పూర్తి అధ్వానంగా మారింది.

శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో పాటు స్థానిక ప్రజలు అగ్రహారం ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి మొగ్గు చూపుతారు.

అంజన్న ఆలయానికి వచ్చే భక్తులు వారి గ్రహ దోషాలు పోవడానికి నవ గ్రహ ప్రదక్షణలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇదిలావుంటే ఆలయానికి వచ్చిన భక్తులు నవగ్రహాల దుస్థితిని చూసి నోరెళ్ల బెడుతున్నారు.

నవగ్రహాలు ఏర్పాటైన గద్దె నిర్మాణం శిథిలావస్థకు చేరుకొని పూర్తి అధ్వానంగా మారింది. దీంతో భక్తులు నవగ్రహాలకు తైలాభిషేకాలు, ప్రదక్షిణలు, పూజలు చేసే సమయంలో నేలపాలై ఆంధ వికారంగా మారుతుంది.

దీంతో పూజలకు పూర్తి అసౌకర్యంగా మారి ఇబ్బందులు పడాల్సివస్తుంది. ఇది చూసిన భక్తులు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.

నవగ్రహలు ఉన్న స్థలంలో మరమ్మతులు చేసి పూజలు చేసుకునేందుకు సౌకర్యవంతంగా చేయాలని కోరుతున్నారు. లేదంటే భక్తుల మనోభావాలకు, ఆలయ పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here