బెంగళూరు: ఓవైపు నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటగా, మరోవైపు బృహత్ బెంగళూరు హోటళ్ల సంఘం టిఫిన్ ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలకు అనుగుణంఆ టిఫిన్ రేట్లను 10 శాతం పెంచారు. ఇప్పటికే బియ్యం, కూరగాయల ధరలు బాగా పెరిగాయాని, గ్యాస్ ధరలు సైతం అధికంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. దీంతో ఆగస్టు 1 నుంచి లీటర్ పాల ధర రూ.3, కిలో కాఫీ పొడి రూ.100 వరకు పెరగనున్నాయి. అలాగే టీ, కాఫీల ధరలు కూడా రూ.3 వరకు పెరగనున్నాయి. అయితే పెంచిన ధరలకు వినియోగదారులు సహకరించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. కొవిడ్ సమయంలో రెండేళ్ల పాటు హోటల్ పరిశ్రమ దారుణంగా దెబ్బతిన్నదని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో నిత్యవసరాల ధరలు పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచినట్లు పునరుద్ఘటించారు.