రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎనునుల అరుణ్ పటేల్

0
24

– మున్నూరుకాపు యువత రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షులు నియామకం
– రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా చెట్టిపల్లి నరేశ్‌ పటేల్
ప్రజానావ/వేములవాడ రూరల్‌: మున్నూరుకాపు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎనునుల అరుణ్ పటేల్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా చెట్టిపల్లి నరేశ్‌ పటేల్‌ నియామకమయ్యారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మున్నూరుకాపు యువత, మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం రాష్ట్ర కమిటీలు, జిల్లా అధ్యక్షుల కమిటీని నియమిస్తూ యువత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజీవ్ పటేల్ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనమాల ప్రవీణ్ కుమార్ పటేల్, సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాదినేని రమేశ్‌ పటేల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముకుందా అనిల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతపండు మహేందర్ పటేల్‌, యువత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యదా క్రాంతి పటేల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి అనిల్ పటేల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంగరాల రాజేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here