రాష్ట్రంలో ‘రూల్‌ ఆఫ్‌ లా’ లేదు

0
41
source: twitter (file)

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు


ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు శాంతియుతంగా సభలు నిర్వహిస్తామంటే అనుమతివ్వని ప్రభుత్వం.. వైసీపీ నేతల సభలకు మాత్రం ఆగమేఘాల మీద ఒప్పుకోవడం అప్రజాస్వామికమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

ప్రతిపక్షాల సభలకు అనుమతులు నిరాకరిస్తూ అక్రమ అరెస్టులు, గృహనిర్భంధాలు, నిరంకుశ చర్యలతో వేధింపులకు గురిచేస్తూ వైసీపీ నేతలకు మాత్రం నడిరోడ్డు మీద అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు.

ఆసరా, సిద్ధం అంటూ ప్రజలను ఇబ్బంది పెట్టేలా, ట్రాఫిక్‌ జామ్‌ చేసేలా అనుమతులు ఎలా ఇస్తారు? రాష్ట్రంలో ‘రూల్‌ ఆఫ్‌ లా’ లేదు. వైసీపీ రాప్తాడులో చేపట్టిన సభకు నేషనల్‌ హైవే పక్కన ఏ విధంగా అనుమతిస్తారని ప్రశ్నించారు.

నిత్యం వేలాదిమంది బెంగుళూరు`హైదరాబాద్‌ వెళ్లే రహదారి పక్కన సభకు అనుమతిచ్చి లక్షల మందిని ఇబ్బంది పెట్టడం సైకోతత్వానికి నిదర్శనం.

సభకు వారం రోజుల ముందునుంచే జాతీయ రహదారి మీద కూడా ఆంక్షలు విధించడం దేనికి సంకేతం? రైతులు తమ ఉత్పత్తులను బెంగళూరు, హైదరాబాద్‌ మార్కెట్లకు తరలించలేని పరిస్థితి నేడు నెలకొంది. ఫిబ్రవరి 18న మీటింగ్‌ ఉంటే 11 నుంచే ఆంక్షలు విధిస్తారా?

తెలుగుదేశం పార్టీ సభలకు నిబంధనలకు అనుగుణంగా అనుమతులివ్వని అధికారులు ఈ సభలకు ఎందుకు ఇస్తారు? వైసీపీ నేతల ఆగడాలు ఇంకెన్ని రోజులో సాగవు.. కౌంట్‌డౌన్‌ మొదలైందని అచ్చెన్నాయుడు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here