కేసీఆర్‌ పుట్టినరోజు.. కోడెమొక్కుతో పూజలు

0
206

kcr birthday: వేములవాడ నియోజకవర్గవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదినోత్సవ వేడుకలను బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా శనివారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో కోడె మొక్కు చెల్లించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ముందు కేక్ కట్‌ చేసి స్వీట్లు పంచారు.

ఈ వేడుకల్లో నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు గారు, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నాగయపల్లిలో కేక్‌ కట్‌ చేసిన నేతలు


వేములవాడ రూరల్ మండలం నాగాయపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ 70వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాల సైతం లెక్కచేయకుండా అహర్నిశలు పోరాడుతూ పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

అనంతరం కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు కచ్చు పరుశురాములు, మాజీ సర్పంచ్ తంపుల సుమన్, బీఆర్‌ఎస్‌ నాయకులు చెట్టిపల్లి నరేశ్‌ పటేల్, కోరే తిరుపతి, సూర మల్లయ్య, గుంట బాలయ్య, శ్రీను, చెట్టిపల్లి తిరుపతి, సాయి కుమార్, నాగరాజు,

భూమయ్య, రవి, జంగం చందు, బండి రాజు, రొండి నవీన్, ఏనుగుల శ్రీకాంత్, కోరే ప్రశాంత్, బండారి బీరయ్య, కొల్లూరి పర్షయ్య, మాసం రాజేశం గ్రామ ప్రజలు, కేసీఆర్ అభిమానులు, రైతులు, యువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here