నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ చేసిన పోలీసులు
తల్లిదండ్రులు మందలించారని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ బాలిక అత్యాచారానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ తుకారం గేట్ పీఎస్ పరిధిలో ఉండే బాలిక (16) కొంతకాలంగా తరుచూ ఫోన్‌లో మాట్లాడుతుండడంతో తల్లిదండ్రులు మందలించారు.
దీంతో మనస్తాపం చెందిన బాలిక ఆదివారం ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. అదే సమయంలో బాలికకు పరిచయమైన ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డి (28) బాలికకు మాయమాటలు చెప్పి కాచిగూడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేసి పారిపోయాడు.
ఆ తర్వాత ఇంటికి చేరుకున్న బాలికను తల్లిదండ్రులు నిలదీయండంతో అసలు విషయం చెప్పింది. ఈ ఘటన బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు సందీప్‌రెడ్డిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.