రాష్ట్రంలో డిమాండ్ ఉన్న బీర్లు దొరక్కపోవడంతో వైన్స్ షాప్ నిర్వాహకులు ఊరు పేరులేని బ్రాండ్లను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
దీంతో మార్కెట్‌లోకి కొత్త పేర్లతో బీర్లు అందుబాటులో తెచ్చేందుకు ప్రభుత్వం సోమ్ డిస్టిల్లరీస్‌కు అనుమతిచ్చింది. దీని నుంచి పవర్ 1000, బ్లాక్‌ఫోర్ట్, హంటర్, వుడ్‌పీకర్ బీర్లు అందుబాటులోకి రానున్నాయి.
మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ప్రవేశపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు.
తెలంగాణలో మద్యం అమ్మడానికి ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదని మంత్రి జూపల్లి ప్రకటించగా.. సోమ్ డిస్టిల్లరీస్ సంస్థ మాత్రం రాష్ట్రంలో తన కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం విశేషం.