Nizamabad: స్కానింగ్‌ కోసం వస్తే న్యూడ్‌ ఫొటోలు, వీడియోలు

0
642

నిజామాబాద్‌లో దారుణం

స్కానింగ్‌ సెంటర్ల ఆపరేటర్లు బరితెగించారు. పరీక్షల కోసం స్కానింగ్‌ సెంటర్‌కు వచ్చిన మహిళల న్యూడ్‌ ఫొటోలు, వీడియోలను వారికి తెలియకుండా చిత్రీకరించిన ఘటన నిజామాబాద్‌లో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌ జిల్లా అయ్యప్ప స్కానింగ్‌ సెంటర్‌ ఆపరేటర్‌ ఇక్కడ పరీక్షల కోసం వచ్చే మహిళలను వారికి తెలియకుండానే న్యూడ్‌ ఫొటోలు, వీడియోలు తీసేవాడు.

ఆ తర్వాత వాటిని సదరు మహిళలకు చూపించి తన కోరిక తీర్చాలని బెదిరించేవాడు. ఎవరైనా మాట వినకుంటే సోషల్‌ మీడియాలో వీడియోలు, ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తానంటూ బెదిరించేవాడు.

దీంతో చాలామంది మహిళలు చేసేదిలేక వాడు చెప్పినట్లు చేసేవారు. ఇదిలాఉంటే ఇటీవల ఓ మహిళకు ఇతడి వద్ద నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. నీ ఫోన్‌ చెక్‌ చేస్కో అంటూ మాట్లాడాడు.

తన ఫోన్‌ చూసిన మహిళ షాక్‌కు గురైంది. తన న్యూడ్‌ ఫొటోలు రావడంతో భయాందోళనకు గురైంది. ఎప్పటిలాగే సదరు ఆపరేటర్‌ తన కోరిక తీర్చాలని బెదిరించడంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో ఆపరేటర్‌ సోషల్‌ మీడియాలో న్యూడ్‌ ఫొటోలను పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై కలెక్టర్‌ సీరియస్‌ అయ్యారు. వెంటనే అయ్యప్ప స్కానింగ్‌ సెంటర్‌కు నోటీసులు జారీ చేశారు.

వివరణ ఇవ్వాలని డీఎంహెచ్‌ఓకు ఆదేశాలు జారీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దీంతో మహిళలు, యువతులు స్కానింగ్‌ సెంటర్లకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. మరోవైపు ఇలాంటి స్కానింగ్‌ సెంటర్లను గుర్తించి వెంటనే అనుమతులు రద్దు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ జిల్లావ్యాప్తంగా వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here