– ఆదర్శ మాల సంక్షేమ సంఘం సంకేపల్లి అధ్యక్షుడిగా పండుగ శ్రీనివాస్
ప్రజానావ/వేములవాడ రూరల్: ఆదర్శ మాల సంక్షేమ సంఘం సంకేపల్లి అధ్యక్షుడిగా పండుగ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన సంక్షేమ సంఘం సమావేశంలో పండుగ శ్రీనివాస్‌తో పాటు ఉపాధ్యక్షుడిగా పండుగ గోపాల్, ప్రధాన కార్యదర్శిగా పండుగ సంజీవ్, కోశాధికారి పండుగ అంజయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి పండుగ నరేశ్ , కుల పెద్దగా పండుగ లక్ష్మీరాజం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు పండుగ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికకు సహకరించిన ఆదర్శ మాల సంక్షేమ సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం కోసం అహర్నిశలు పాటుపడుతూ కుల సంఘ భవనానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా నియమించిన కుల బంధావులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.