చెలరేగిన టీమిండియా

0
18

– వెస్టిండీస్‌ ముంగిట భారీ స్కోర్‌
ట్రినిడాడ్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా బ్యాటర్లు చెలరేగి ఆడారు. దీంతో భారత్‌ నిర్ణీత ఓవర్లలో కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 351 పరుగులు చేసింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (77), శుభ్‌మన్‌ గిల్‌ (85) మొదటి వికెట్‌కు 143 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలో కిషన్‌ కారియా బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రుజురాజ్‌ గైక్వాడ్‌ (8) తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్‌ గిల్‌తో కలిసి విండీస్ బౌలర్లను పరుగులు పెట్టించాడు ఈ క్రమంలో సంజూ శాంసన్‌ (51) అర్ధ సెంచరీ సాధించిన కొద్దిసేపటికే షెఫర్డ్‌ బౌలింగ్‌లో హెట్మైర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాతో కలిసి గిల్‌ స్కోరు బోర్డును పెంచే క్రమంలో సెంచరీకి 15 పరుగుల దూరంలో మోతీ బౌలింగ్‌ అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన 360 డిగ్రీ ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (35) కూడా ఇలా వచ్చి అలా వెళ్లాడు. దీంతో ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా (8, నాటౌట్‌)తో కలిసి పాండ్యా (70, నాటౌట్‌) చివరి వరకు ఉండడంతో భారత్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 351 పరుగులు చేసింది. వెస్టిండీస్‌ బౌలర్లలో షెఫర్డ్‌ 2 వికెట్లు తీయగా, జొసెఫ్‌, మోతీ,కారియాలు ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here