– హాజరుకానున్న 9,47,699 మంది విద్యార్థులు
తెలంగాణలో బుధవారం నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది 9,47,699 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు పరీక్ష హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. విద్యార్థులు https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్ నుంచి కూడా హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. ఎస్సెస్సీ హాల్ టిక్కెట్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి ఇంటర్ మొదటి సంవత్సర హాల్ టిక్కెట్లు పొందవచ్చని పేర్కొంది. అలాగే, గతేడాది పరీక్ష రాసిన హాల్‌టిక్కెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా ద్వితీయ ఇంటర్ విద్యార్థులు తమ పరీక్ష హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. బోర్డు ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను గతేడాది డిసెంబర్‌లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరగనుండగా, ఎల్లుండి నుంచి రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి.