టీఎస్‌పీఎస్సీ భేటీ

0
14

– గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ లీకుపై చర్చ
– ఏఈ పరీక్ష రద్దు చేసే యోచన
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భేటీ అయ్యింది. టీఎస్‍పీఎస్సీ ఏఈ పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ కూడా లీకైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ కుమార్ అధికారులు సస్పెండ్ చేయగా, మరో ఔటసోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ క్రమంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్ధన్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయింది. ఈ నెల 5న జరిగిన పరీక్ష పేపర్ లీకేజీ పై కమిషన్ చర్చించనుంది. ఏఈ పరీక్ష రద్దు చేసే యోచనలో కమిషన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగ అభ్యర్థుల ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు ఈ లీకేజీల వ్యవహారంపై ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాలని ఇప్పటికే టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here