అందరినీ ఒకేసారి ఎలా పిలుస్తారు?

0
28

– గందరగోళంగా అండర్‌ -16 బాయ్స్‌ సెలక్షన్స్‌
– హెచ్‌సీపై క్రీడాకారుల తల్లిదండ్రుల ఆగ్రహం
ప్రజానావ/హైదరాబాద్‌ స్పోర్ట్స్‌: ‘అందరినీ ఒకేసారి ఎలా పిలుస్తారు? పిల్లలను ఇంత ఇబ్బంది పెడతారా?’ అంటూ హెచ్‌సీఏ (హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌) తీరుపై అండర్‌-16 క్రీడాకారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వారిపైనా అసహనం వ్యక్తం చేశారు. అసలు విషయం ఏంటంటే అండర్‌ -16 బాయ్స్‌ సెలక్షన్స్‌ను హెచ్‌సీఏ (Hyderabad Cricket Association) మూడు రోజులుగా ఉప్పల్‌ స్టేడియంలో నిర్వహిస్తోంది. దీంతో సెలక్షన్స్‌లో పాల్గొనేందుకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఇదే క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి క్రీడాకారులు రావడంతో హెచ్‌సీఏ వారిని వెనక్కి పంపింది. ఇక పెద్దమొత్తంలో క్రీడాకారులు రావడం, హెచ్‌సీఏ ప్రణాళికలోపంతో క్రీడాకారులు నానా అవస్థలు పడ్డారు. ఉదయం నుంచి ఉప్పల్‌ స్టేడియం గేటు వద్దే గంటల కొద్దీ వేచి చూస్తున్నారు. ఇక్కడే క్రీడాకారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కోరోజు ఒక్కో జిల్లా క్రీడాకారులను పిలవకుండా.. అందరినీ ఎలా పిలుస్తారంటూ మండిపడ్డారు. తమ పిల్లలు తిండి, నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఒక పద్ధతి ప్రకారం సెలక్షన్స్‌ నిర్వహించడం లేదని, అంతా గందరగోళంగా ఉందని విమర్శించారు. ఇదిలాఉంటే హెచ్‌సీఏను హెచ్‌సీఏను గాడిలో పెట్టేందుకు సుప్రీం కోర్టు నియమించిన సింగిల్ జడ్జి, రిటైర్డ్ జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు అసోసియేషన్‌ భారీ ప్రక్షాళనకు నడుం బిగించింది. నిబంధనలకు విరుద్దంగా ఉన్న 57 క్రికెట్ క్లబ్‌లపై సోమవారం కఠిన చర్యలు తీసుకుంది. హెచ్‌సీఏ తదుపరి ఎన్నికల్లో పోటీ చేయకుండా సదరు క్లబ్‌లపై నిషేధం కూడా విధించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here