సౌలత్ లు బాగున్నాయా?

0
25

– భోజనమెట్లుంది?
– పండుటాకులకు కలెక్టర్ ఆత్మీయ పలరింపు
ప్రజానావ/తంగళ్లపల్లి: ‘సౌలత్ లు బాగున్నాయా.. భోజనమెట్లుంది? అన్ని వసతులు సక్రమంగా కల్పిస్తున్నారా.. లేదా?’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పండుటాకులను ఆత్మీయంగా పలకరించారు. మంగళవారం ఆయన తంగళ్లపల్లి మండలం మండెపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ వయో వృద్ధుల ఆశ్రమాన్ని క్షేత్ర స్థాయిలో సందర్శించి, వృద్ధులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అక్కడున్న వయోవృద్ధులతో ముచ్చటించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అందుతున్న భోజన, వైద్య సదుపాయాల గురించి ఆరా తీశారు. అనంతరం నిర్వాహకులతో మాట్లాడుతూ ఫిజికల్ యాక్టివిటీస్ ని మెరుగుపరచాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి వారం క్రమం తప్పకుండా వైద్యాధికారితో పరీక్షలు చేయించాలన్నారు. అలాగే బాలసదనం నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులు వేగవంతం చేసి, త్వరగా పూర్తిచేయాలని జిల్లా సంక్షేమ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, ఉప తహశీల్దార్ దివ్య, తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here