– నాగాలాండ్ ఎమ్మెల్యేల తిరుగుబాటు
ఎన్సీపీ సీనియర్ నాయకుడు శరద్ పవార్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. నాగాలాండ్ లో ఆ పార్టీ కి ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు నాయకుడు అజిత్ పవార్ వర్గానికి మద్దతు పలికారు. సంప్రదింపులు, చర్చల తర్వాత నాగాలాండ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఆఫీస్ బేరర్లు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించినట్లు శాసనసభ్యులు ఒక లేఖ విడుదల చేశారు. జులై 2న అజిత్ పవార్, 8 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తద్వారా ఎన్సీపీలో చీలికను అజిత్ వర్గం ఖాయం చేసింది.