– నేడే చివరి తేదీ
టెన్త్ చదవకపోయినా ఐటిఐ చేయడమేంటని అనుకుంటున్నారా? అవును మీరు చదువుతున్నది నిజమే. పది తరగతి మధ్యలో ఆపేసిన ఐటిఐ కోర్సు చదవొచ్చు. కానీ మీరు 8వ తరగతి వరకైనా చదవి ఉండాలి. తాజాగా టీఎస్ ఆర్టీసీ ఐటీఐ కళాశాల వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తి ల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ ట్రెడ్‌లలో అడ్మిషన్లను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అభ్యర్థులు ఈ నెల 31 ఆఖరు తేదీగా నిర్ణయించారు. టిఎస్ ఆర్టీసీ నిపుణులైన అధ్యాపకులతో ఈ శిక్షణ నిర్వహిస్తోంది. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న ఆర్టీసీ డిపోల్లీ అప్రెంటిషిప్ సౌకర్యం కల్పించనుంది. ప్రవేశాలకు సంబంధించిన వివరాలకు వరంగల్ ములుగు రోడ్డులోని టీఎస్ ఆర్టీసీ ఐటీఐ కళాశాల ఫోన్ నంబర్లు 9849425319, 8008136611 ను సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జులై 23న ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.