68వ అంతస్తు నుంచి కిందపడి!

0
16

– కొంపముంచిన స్టంట్‌
– ప్రాణాలు కోల్పోయిన రెమీ లూసిడి
రెమీ లూసిడి ఈపేరు చాలా ఫేమస్‌.. ఇతగాడు అంటే దాదాపు తెలియని వారుండరు. నిత్యం ఆకాశహర్మ్యాలపై విన్యాసాలు చేస్తూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే అదే స్టంట్‌ అతడి ప్రాణం తీసింది. అవును.. 30ళ్ల రెమీ లూసిడి ఇకలేరనే వార్తను అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. దక్షిణ చైనా మార్నింగ్‌ పోస్ట్‌లోని ఓ నివేదిక ప్రకారం.. రెమీ హాంకాంగ్‌లోని ఓ ఎత్తయిన భవనంలోని 68వ అంతస్తు పైకి ఎక్కి స్టంట్‌ చేయాలనుకున్నాడు. కానీ నియంత్రణ కోల్పోయి కాలుజారి కిందపడ్డాడు. దీంతో క్షణాల్లోనే రెమీ మరణ వార్త విన్న అభిమానులు కంటతడి పెడుతున్నారు. ఇంత చిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here