టీమిండియా తడ’బ్యాటు’

0
12

– రెండో వన్డేలో వెస్టిండీస్‌ ఘన విజయం
బార్బడోస్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు పరాజయం పాలైంది. శనివారం బార్బడోస్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 40.5 ఓవర్లలోనే 181 పరుగులకు కుప్పకూలింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (55) అర్ధ సెంచరీతో రాణించగా, శుభ్‌మన్‌ గిల్‌ (34), సూర్య కుమార్‌ యాదవ్‌ (24) కాస్త ఫర్వాలేదనిపించారు. జట్టులో ఐదుగురు సింగిల్‌ డిజిట్‌కే పెవిలియన్‌ చేరారు. విండీస్‌ బౌలర్లలో షెపర్డ్‌, మోటీ మూడేసి వికెట్లు తీయగా, జోసెఫ్‌ 2, సీల్స్‌, కారియా ఒక్కో వికెట్‌ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌ జట్టు 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ షాయ్‌ హోప్‌ (63, నాటౌట్), కార్టీ (48, నాటౌట్‌), కైల్‌ మేయర్స్‌ (36) రాణించారు. భారత బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా, కుల్దీప్‌ యాదవ్‌కు ఒక వికెట్‌ దక్కింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌, వెస్టిండీస్‌ 1-1 తేడాతో సమానంగా నిలిచాయి. ఇరుజట్లు మధ్య చివరి వన్డే ఆగస్టు 1న జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here